వరంగల్ గ్రామీణ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు కట్ట తెగి వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపైకి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి జాతీయ రహదారి కోతకు గురై.. రోడ్డు కొట్టుకుపోయింది.
ఓరుగల్లులో ఆగని వర్షం.. తెగిన కోనారెడ్డి చెరువు కట్ట.. - తెగిపోయిన కోనారెడ్డి చెరువు కట్ట
ఓరుగల్లులో వర్ష బీభత్సం ఆగట్లేదు. ఎడతెరిపిలేకుండా కురిసే వర్షాలకు వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుకట్ట తెగిపోయింది. దీనితో అక్కడి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ఓరుగల్లులో ఆగని వర్షం.. తెగిన కోనారెడ్డి చెరువు కట్ట..
రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి.
ఇదీ చదవండి-రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా