తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ గ్రామీణ జిల్లాలో జోరుగా వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు

గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరంగల్​ గ్రామీణ జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

heavy rains in warangal rural district
వరంగల్ గ్రామీణ జిల్లాలో జోరుగా వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు

By

Published : Aug 13, 2020, 3:02 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లోని చెరువులు పూర్తి స్థాయిలో అలుగు పారుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయపనులకు ఈ వర్షాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details