వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిశాయి. నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, చెన్నారావుపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వరుణుడు ప్రతాపం చూపాడు.
Heavy rains: వరుణుడి ప్రతాపం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం - heavy rains in warangal rural district
నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఊహించని వానతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ గ్రామీణ జిల్లాలో రైతులు పండించిన పంట నీటిపాలైంది.
![Heavy rains: వరుణుడి ప్రతాపం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం heavy rains in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12001158-769-12001158-1622717604959.jpg)
వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షం
ఈ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటికే ధాన్యాన్ని తరలించారు. మరికొన్ని గ్రామాల్లో లారీల కొరత కారణంగా ధాన్యం.. కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో టార్పాలిన్లు కప్పని బస్తాలు వర్షానికి తడిశాయి. మళ్లీ వర్షం కురిస్తే ధాన్యం ఎక్కువగా తడిసే ప్రమాదముందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో వరుణుడి ప్రతాపం
ఇదీ చదవండి:KTR: 'హెల్త్‌కేర్ వర్కర్లను దేవునితో సమానంగా చూస్తున్నారు'