వరంగల్ గ్రామీణ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం కారణంగా భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షం.. తడిసిపోయిన ధాన్యం - వరంగల్ గ్రామీణంలో పిడుగుపాటుకు బలైన మూగజీవాలు
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల పిడుగుపడి మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
భారీ వర్షానికి తడిసిపోయిన ధాన్యం
వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం నీట తడిసింది. భారీ శబ్దాలతో పడిన పిడుగు పాటుకు మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. సంగెం మండలం కుంటపల్లి వద్ద ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటం వల్ల చెట్టు పూర్తిగా కాలిపోయింది.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు