వరంగల్ గ్రామీణ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం అర్ధరాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుసింది. ఈ రోజు ఉదయం 5 గంటలనుంచి 8 గంటల వరకు అతి భారీ వర్షం కురిసింది. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలాగే కోనారెడ్డి చెరువు బ్రిడ్జి అనుసంధాన రోడ్డు మరోసారి కోతకు గురైంది. దీంతో అధికారులు భారీ వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షం... పొంగిపొర్లిన వాగులు - konareddy pond
వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ఉద్ధృతరూపం దాల్చింది. వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్ధన్నపేట మండలంతో పాటు రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది.
సంగెపు వాగు ప్రవహించడం వల్ల వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయం సహా పోలీస్‌స్టేషన్‌లోకి నీరు చేరింది. మోటార్ల సహాయంతో పోలీసులు నీటిని బయటకు ఎత్తిపోశారు. అలాగే వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలోని స్వామి తండా కుంటకు భారీ గండి పడి నీరు గ్రామంలోకి ప్రవహిస్తున్న క్రమంలో గ్రామస్థులు మేల్కొని ఆ నీటిని పక్కనే ఉన్న కెనాల్‌కు మళ్లించారు. వర్ధన్నపేట మండలంలోని పలుగ్రామాల్లో ఇళ్లు నేలమట్టం కాగా... రాయపర్తి, సంగెo, పర్వతగిరి మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది.
ఇవీ చూడండి: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద