వరంగల్ గ్రామీణ జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో అధికంగా వర్షం కురియగా... కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది.
బీభత్సం సృష్టించిన గాలివాన
ఆకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. వరంగల్ గ్రామీణ జిల్లాలో కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయాయి. రెండు చోట్ల పిడుగుపాటుకు రైతులు మృతిచెందారు.
బీభత్సం సృష్టించిన గాలివాన
చెన్నారావుపేట మండలం లింగాపురంలో పిడుగుపడి ముచ్చిక కుమారస్వామి, అజ్మీర స్వామిల మృతి చెందారు. ఖానాపురంలో శ్రీనివాస రైస్ మిల్లు పైకప్పు లేచిపోయి బియ్య బస్తాలు తడిశాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఖానాపురంలో తడిసిన ధాన్యాన్ని నర్సంపేట ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.