వరంగల్ జిల్లా హనుమకొండలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో పలు కాలనీలు, ప్రధాన రోడ్లు జలసంద్రంగా మారాయి. పలు కాలనీల్లో వరద ప్రవాహం ఇళ్లలోకి పెద్దఎత్తున ప్రవహిస్తోంది. ముఖ్యంగా పట్టణంలోని సమ్మయ్యనగర్, ద్వారక నగర్, ప్రగతికాలనీ, వికాస్‌నగర్, అమరావతినగర్, టీవీటవర్ కాలనీల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది.
హనుమకొండను చుట్టుముట్టిన వరద...ఆందోళనలో ప్రజలు
వరంగల్ జిల్లా హనుమకొండలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు వరద నీటిలోనే ఉండిపోయాయి. ఇళ్లలోకి పెద్దఎత్తున వరద ప్రవాహం వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హనుమకొండను చుట్టుముట్టిన వరద...ఆందోళనలో ప్రజలు
వంద అడుగుల రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఇళ్లలోకి వేగంగా వరద నీరు రావడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు కట్టడంతో వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసరాల కోసం బయటకు రావాలన్న భయపడిపోతున్నారు.