తెలంగాణ

telangana

ETV Bharat / state

భవిష్యత్ తరాల కోసమే హరితహారం: ఎమ్మెల్యే చల్లా - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజా వార్తలు

భవిష్యత్​ తరాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్​ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. వరంగల్​ రూరల్​ జిల్లా ఊకల్​లో మొక్కలు నాటారు.

haritha haram for future generations: Challa
భవిష్యత్ తరాల కోసమే హరితహారం: చల్లా

By

Published : Jul 12, 2020, 11:45 AM IST

వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఊకల్​ గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని వైశ్యులకు సంబంధించిన 8 ఎకరాల స్థలంలో మొక్కలు నాటారు.

నియోజకవర్గ పరిధిలోని వాగులు, చెరువులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుగుతోందన్నారు. భవిష్యత్‌ తరాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశ్​రావు, కుడా ఛైర్మన్​ మర్రి యాదవరెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ పమేలా సత్పతి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: సీఎం కేసీఆర్​కు పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details