ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఆమె స్వీకరించారు. ఇందులో భాగంగా హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మరో ఆరుగురు అధికారులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు.
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కలెక్టర్ హరిత - కలెక్టర్ హరిత గ్రీన్ ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా పాలనాధికారి హరిత మొక్కలు నాటారు.
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కలెక్టర్ హరిత