వరంగల్ జిల్లా ముప్పారంలోని త్రికూట ఆలయాన్ని సంరక్షించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు గవర్నర్ లేఖ రాశారు. కాకతీయ కాలం నాటి త్రికూట ఆలయానికి మరమ్మతులు చేసి... ఘనచరిత్రను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖను కోరారు. రామాయణ గాథలు చెక్కిన త్రికూట ఆలయం శిథిలావస్థకు చేరుకుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముప్పారం త్రికూటాలయాన్ని సంరక్షించాలని కేంద్రానికి గవర్నర్ లేఖ
ఘనచరిత్ర కలిగిన వరంగల్ జిల్లా ముప్పారం త్రికూటాలయాన్ని కాపాడాలని కేంద్రానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. రామాయణ గాథలు చెక్కిన త్రికూట ఆలయం.. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆలయానికి మరమ్మతులు చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖను కోరారు.
తక్షణమే ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. త్రికూటాలయం లాంటి కాకతీయుల అద్భుత నిర్మాణాలను కాపాడడం అత్యంత అవసరమని... భవిష్యత్ తరాలు అద్భుత గత చరిత్ర తెలుసుకునే అవకాశం ఉందని తమిళిసై అభిప్రాయపడ్డారు. ఎన్నో చారిత్రక కట్టడాలతో ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని తెలంగాణ కలిగి ఉందన్న తమిళిసై... కాకతీయులు ఎన్నో గొప్ప నిర్మాణ అధ్భుతాలతో ఘనమైన వారసత్వాన్ని అందించారని కొనియాడారు.