సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రెండొందల మీటర్ల జాతీయ జెండాతో త్రివర్ణ ర్యాలీ చేపట్టారు.
ద్వారక పేట రోడ్డు నుంచి పాకాల సెంటర్ వరకు భారీ జాతీయ జెండాతో ఈ కార్యక్రమం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విమోచన దినోత్సవం ప్రభుత్వమే జరపాలి : ఏబీవీపీ - తెలంగాణ విమోచన దినోత్సవం
భారీ జాతీయ జెండాతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే చేపట్టాలని వరంగల్ గ్రామీణ జిల్లాలో ఏబీవీపీ ర్యాలీ చేపట్టింది.
![విమోచన దినోత్సవం ప్రభుత్వమే జరపాలి : ఏబీవీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4470086-thumbnail-3x2-abvp.jpg)
రెండొందల మీటర్ల జాతీయ జెండాతో త్రివర్ణ ర్యాలీ
రెండొందల మీటర్ల జాతీయ జెండాతో త్రివర్ణ ర్యాలీ
ఇవీ చూడండి : నిజాం సమాధి వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లాడు...?