తెలంగాణ

telangana

ETV Bharat / state

బావి ఘటన.. అసలేం జరిగిందంటే..? - gorrekunta well incident Accused arrest in warangal rural district

new-perspective-in-gorrekunta-well-incident-at-warangal-rural-district
బావి ఘటన పూర్తి వివరాలు

By

Published : May 25, 2020, 4:19 PM IST

Updated : May 25, 2020, 5:56 PM IST

17:39 May 25

బావి ఘటన పూర్తి వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్​ బావి ఘటన శవాల గుట్టును పోలీసులు ఛేదించారు. సోమవారం నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వరంగల్‌ పోలీసులు... 3రోజుల్లోనే బిహార్​కు చెందిన సంజయ్​కుమార్​ యాదవ్​ను​ నిందితుడుగా తేల్చారు. సంజయ్​... తొమ్మిది మందిని హత్య చేసి బావిలో వేసినట్లు.. వరంగల్​ సీపీ రవీందర్​ పేర్కొన్నారు.

మృతుల వివరాలు...

మూడేళ్ల బాలుడు బబ్లూ, మమ్మద్​ మక్సూద్‌, నిషా ఆలమ్‌, బుష్రా, షాబాజ్‌, నుహేల్‌, శ్యామ్‌కుమార్‌ షా, శ్రీరామ్‌కుమార్‌ షా, షకీల్‌లను సంజయ్​ హతమార్చాడు.  

అసలు ఎవరీ సంజయ్​...

నిందితుడు బిహార్‌లోని నుర్లపూర్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం జాన్‌పాకలో నివాసం ఉంటున్నట్లు సీపీ తెలిపారు. ఆరు బృందాలతో కేసును ఛేదించామని వివరించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మక్సూద్‌కు ఐదారేళ్ల క్రితం సంజయ్‌ పరిచయమయ్యారని సీపీ చెప్పారు.  

మక్సూద్​కి సంజయ్​కు సంబంధం?

ఐదేళ్ల క్రితం మక్సూద్‌ సోదరి రఫిక బంగాల్‌ నుంచి వరంగల్‌కు ఉపాధి కోసం వచ్చింది. సంజయ్‌కుమార్ ఒంటరిగా ఉండేవాడు. సంజయ్​‌కు డబ్బులు తీసుకుని రఫిక భోజనం ఏర్పాటు చేసేది. క్రమంగా వీరి‌ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. రఫిక కుమార్తెతో కూడా సంజయ్‌కుమార్ సన్నిహితంగా ఉండేవాడు. ఇదే విషయంపై రఫిక నిలదీసింది. పలుమార్లు సంజయ్‌కుమార్‌తో గొడవపడింది. రఫికను వివాహం చేసుకుంటానని నమ్మించినట్లు సంజయ్‌ విచారణలో తెలిపాడు. ఆ తర్వాత కూడా రఫిక కుమార్తెతో సన్నిహితంగా ఉండేవాడినని వివరించారు. సంజయ్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫిక బెదిరించింది.

అడ్డు తొలగించుకునేందుకే..

రఫికను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్‌... పెళ్లి విషయాన్ని బంధువులతో చర్చించేందుకు బంగాల్‌ వెళ్దామని నమ్మించాడు. మార్చి 6న గరీబ్‌ రథ్‌ రైలులో రాత్రి 10 గంటలకు రఫికను తీసుకుని బయలుదేరాడు. రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను అందించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే చున్నీతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు. తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రఫిక చనిపోయిందని నిర్ధరించుకున్నాక రాజమహేంద్రవరంలో దిగి మరో రైలులో వరంగల్‌ చేరుకున్నాడు.

భయంతోనే... ఇలా...

బంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందని రఫిక పిల్లలను నమ్మించాడు. రఫిక బంధువుల ఇంట్లో లేదని తెలిసిన తర్వాత మక్సూద్‌ భార్య నిషా ఆలమ్‌ సంజయ్‌ను గట్టిగా నిలదీసింది.  పోలీసులకు సమాచారం ఇస్తానని సంజయ్‌కుమార్‌ను బెదిరించింది. భయంతో నిషా ఆలమ్‌ను చంపాలని సంజయ్‌ నిర్ణయించుకున్నాడు. రఫిక మాదిరిగానే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి  చంపాలనుకున్నాడు. ఆ పథకంతోనే మే 16-20 వరకు మక్సూద్‌ కుటుంబం పనిచేస్తున్న పరిశ్రమ చుట్టూ తిరిగాడు.

పథకం ప్రకారం...

మే 20న మక్సూద్‌ పెద్దకుమారుడు షాబాజ్‌ ఆలమ్‌ పుట్టినరోజని తెలుసుకున్నాడు. అదే రోజు నిషా ఆలమ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మే 18న మెడికల్‌ షాపులో 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మే 20న రాత్రి మక్సూద్‌ కుటుంబంతో చాలాసేపు ముచ్చటించాడు. మక్సూద్‌ కుటుంబం తయారు చేసిన భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్​ ఇంటి పైనే కిరాయికి ఉంటున్న బిహార్ యువకులు శ్యామ్‌, శ్రీరామ్‌ల భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. అందరూ నిద్రలోకి జారుకోగానే సాక్ష్యం దొరక్కుండా ఉండాలని అందరిని బావిలోకి విసిరాడు. అంతా చనిపోయారని నిర్ధరించుకున్నాక మక్సూద్‌ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో సామగ్రి, సెల్‌ఫోన్లు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.

6 బృందాలతో...

కేసు దర్యాప్తునకు 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. గోదాము, గొర్రెకుంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని సీపీ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు జాన్‌పాక్‌లోని ఆతని ఇంట్లోనే సంజయ్​ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విచారణలో నిందితుడు నేరాలు అంగీకరించినట్లు ప్రకటించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మిగతా వాళ్లను చంపాడని సీపీ స్పష్టం చేశారు.  

ఈనెల 21న బావిలో నుంచి 4 మృతదేహాలు వెలికితీశామని... ఈనెల 22న బావిలో నుంచి మరో 5 మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను వరంగల్‌ సీపీ రవీందర్​ అభినందించారు.

17:02 May 25

ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు 9 హత్యలు

  • ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మిగతా వాళ్లను చంపాడు: సీపీ
  • ఈనెల 21న బావిలో నుంచి 4 మృతదేహాలు వెలికితీశాం: వరంగల్‌ సీపీ
  • ఈనెల 22న బావిలో నుంచి మరో 5 మృతదేహాలు వెలికితీశాం: వరంగల్‌ సీపీ
  • కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన వరంగల్‌ సీపీ

16:58 May 25

విచారణలో నేరాలు అంగీకరించిన సంజయ్​

  • కేసు దర్యాప్తునకు 6 బృందాలు ఏర్పాటు చేశాం: వరంగల్‌ సీపీ
  • గోదాము, గొర్రెకుంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించాం: సీపీ
  • ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు జాన్‌పాక్‌లోని సంజయ్‌ ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నాం: సీపీ
  • విచారణలో నిందితుడు నేరాలు అంగీకరించాడు: వరంగల్‌ సీపీ

16:56 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • అందరూ నిద్రలోకి జారుకోగానే సాక్ష్యం దొరక్కుండా అందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు: సీపీ
  • మత్తులో ఉన్న అందరినీ అర్ధరాత్రి 12.30 తర్వాత బావి వద్దకు తరలించాడు: సీపీ
  • అందరినీ బావిలో వేసి చనిపోయారని నిర్ధరించుకున్నాక మక్సూద్‌ ఇంట్లోకి వెళ్లాడు: సీపీ
  • ఇంట్లో సామగ్రి, సెల్‌ఫోన్లు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు: సీపీ

16:53 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • మే 20న మక్సూద్‌ పెద్దకుమారుడు షాబాజ్‌ ఆలమ్‌ పుట్టినరోజు అని తెలుసుకున్నాడు: సీపీ
  • అదే రోజు నిషా ఆలమ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు: సీపీ
  • పథకం ప్రకారం మే 18న మెడికల్‌ షాపులో 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు: సీపీ
  • మే 20న రాత్రి మక్సూద్‌ కుటుంబంతో చాలాసేపు ముచ్చటించాడు: సీపీ
  • మక్సూద్‌ కుటుంబం తయారు చేసిన భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు: సీపీ
  • శ్యామ్‌, శ్రీరామ్‌ తయారు చేసిన భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు: సీపీ

16:40 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • పథకంతో మే 16-20 వరకు మక్సూద్‌ కుటుంబం పనిచేస్తున్న పరిశ్రమ చుట్టూ తిరిగాడు: సీపీ
  • మే 20న మక్సూద్‌ పెద్దకుమారుడు షాబాజ్‌ ఆలమ్‌ పుట్టినరోజు అని తెలుసుకున్నాడు: సీపీ
  • అదే రోజు నిషా ఆలమ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు: సీపీ
  • పథకం ప్రకారం మే 18న మెడికల్‌ షాపులో 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు: సీపీ
     


 

16:39 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • మార్చి 6న గరీబ్‌ రథ్‌ రైలులో రాత్రి 10 గం.కు రఫికను తీసుకుని బయలుదేరాడు: సీపీ
  • రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను అందించాుడ: సీపీ
  • మజ్జిగ తాగిన రఫిక మత్తులోకి జారుకోగానే నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు: సీపీ
  • ఆ తర్వాత నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు: వరంగల్‌ సీపీ
  • తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు కేసునమోదు చేశారు: వరంగల్‌ సీపీ
  • రఫిక చనిపోయిందని నిర్ధరించుకున్నాక రాజమహేంద్రవరంలో దిగి మరో రైలులో వరంగల్‌ చేరుకున్నాడు: సీపీ
  • బంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందని రఫిక పిల్లలను నమ్మించాడు: సీపీ
  • రఫిక బంధువుల ఇంట్లో లేదని తెలిసిన తర్వాత మక్సూద్‌ భార్య నిషా ఆలమ్‌ సంజయ్‌ను గట్టిగా నిలదీసింది: సీపీ
  • రఫిక ఎక్కడ ఉందని సంజయ్‌కుమార్‌ను నిషా ఆలమ్‌ ప్రశ్నించింది: వరంగల్‌ సీపీ
  • పోలీసులకు సమాచారం ఇస్తానని సంజయ్‌కుమార్‌ను బెదిరించింది: సీపీ
  • భయంతో నిషా ఆలమ్‌ను చంపాలని సంజయ్‌ నిర్ణయించుకున్నాడు: సీపీ
  • రఫిక మాదిరిగానే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి నిషా ఆలమ్‌ను చంపాలనుకున్నాడు: సీపీ

16:36 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • సంజయ్‌కుమార్ ఒంటరిగా జీవనం సాగించేవారు: వరంగల్‌ సీపీ
  • సంజయ్‌కుమార్‌కు డబ్బులు తీసుకుని రఫిక భోజనం ఏర్పాటు చేసేవారు: సీపీ
  • రఫిక, సంజయ్‌కుమార్‌ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది: వరంగల్‌ సీపీ
  • రఫిక కుమార్తెతో కూడా సంజయ్‌కుమార్ సన్నిహితంగా ఉన్నాడు: సీపీ
  • సంజయ్‌కుమార్‌ను రఫిక నిలదీశారు: వరంగల్‌ సీపీ
  • సంజయ్‌కుమార్‌తో పలుమార్లు రఫిక గొడవపడింది: వరంగల్‌ సీపీ
  • రఫికను వివాహం చేసుకుంటానని సంజయ్‌ నమ్మించాడు: వరంగల్‌ సీపీ
  • ఆ తర్వాత కూడా రఫిక కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడు: వరంగల్‌ సీపీ
  • సంజయ్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు రఫిక ఫిర్యాదు చేస్తానని బెదిరించింది: సీపీ
  • రఫికను అడ్డుతొలగించుకునేందుకు సంజయ్‌ నిర్ణయించుకున్నాడు: సీపీ
  • పెళ్లి విషయాన్ని బంధువులతో చర్చించేందుకు బంగాల్‌ వెళ్దామని నమ్మించాడు: సీపీ
  • మార్చి 6న గరీబ్‌ రథ్‌ రైలులో రాత్రి 10 గం.కు రఫికను తీసుకుని బయలుదేరాడు: సీపీ
  • రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను అందించాడు: సీపీ

16:34 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • నిందితుడు బిహార్‌లోని నుర్లపూర్‌కు చెందిన సంజయ్‌కుమార్: వరంగల్‌ సీపీ
  • ప్రస్తుతం జాన్‌పాకలో నివాసం ఉంటున్న సంజయ్‌కుమార్: వరంగల్‌ సీపీ
  • ఆరు బృందాలతో కేసును ఛేదించాం: వరంగల్‌ సీపీ
  • హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టాం: వరంగల్‌ సీపీ
  • మక్సూద్‌కు ఐదారేళ్ల క్రితం సంజయ్‌ పరిచయమయ్యారు: వరంగల్‌ సీపీ
  • ఐదేళ్ల క్రితం మక్సూద్‌ సోదరి రఫిక బంగాల్‌ నుంచి వరంగల్‌కు ఉపాధి కోసం వచ్చారు: వరంగల్‌ సీపీ

16:26 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • వరంగల్‌ హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌: సీపీ డా.రవీందర్‌
  • తొమ్మిది మందిని హత్య చేసి బావిలో వేశాడు: వరంగల్‌ సీపీ
  • మృతుల్లో మూడేళ్ల బాలుడు బబ్లూ: వరంగల్‌ సీపీ
  • మృతులు మహ్మద్‌ మక్సూద్‌, నిషా ఆలమ్‌, బుష్రా, షాబాజ్‌
  • మృతులు నుహేల్‌, శ్యామ్‌కుమార్‌ షా, శ్రీరామ్‌కుమార్‌ షా, షకీల్‌

16:25 May 25

బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు

  • వరంగల్‌: బావిలో శవాల గుట్టు ఛేదించిన పోలీసులు
  • నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
  • కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వరంగల్‌ పోలీసులు

15:39 May 25

బావి ఘటన: మీడియా ముందుకు నిందితుడు

  • వరంగల్ గొర్రెకుంట ఘటనలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
  • ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఒకేసారి 9 హత్యలు
  • తొలుత మక్సూద్‌ బంధువైన యువతిని హత్య చేసిన సంజయ్‌కుమార్‌
  • మార్చి 8న మక్సూద్‌ బంధువును హత్య చేసినట్లు తెలిపిన నిందితుడు
  • కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేసిన సంజయ్‌
  • పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని హతమార్చిన సంజయ్‌
  • మొత్తం 10 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్‌


 

Last Updated : May 25, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details