వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పాడుబడ్డ బావిలో తేలిన 9మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించనున్నారు. పశ్చిమ బంగ నుంచి మక్సూద్ బంధువులు రాగా... అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లను పూర్తిచేశారు. సంగెం ఎమ్మార్వోతో పాటు రాయపర్తి ఎమ్మార్వో సంయుక్తంగా పంచనామా వాంగ్మూలాలను స్వీకరించారు.
గొర్రెకుంట ఘటన మృతదేహాలు బంధువులకు అప్పగింత - crime news
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట ఘటనలో మరణించిన 9 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పంచనామాలు, వాంగ్మూలాలు తీసుకున్న అనంతరం ఆయా గ్రామాల ఎమ్మార్వోలకు మృతదేహాలు అప్పగించనున్నారు.
గొర్రెకుంట ఘటన మృతదేహాలు బంధువులకు అప్పగింత
పోలీసుల నుంచి ఆరుగురు మృతదేహాల అప్పగింతకు క్లియరెన్స్ వచ్చినట్లు ఎమ్మార్వో తెలిపారు. మక్సూద్ కుటుంబ సభ్యులను హత్య చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయని వారి బంధువులు ఆరోపించారు. తొమ్మిది మందిని ఒక్కడే హత్య చేయడం సాధ్యం కాదని ఆరోపించిన బంధువులు... నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. షకీల్ మృతదేహాన్ని ఖిల్లా వరంగల్ ఎమ్మార్వోకు అప్పగించగా... బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్ మృతదేహాలను వరంగల్ ఎమ్మార్వోకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.