వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందికి నిద్రమాత్రలు ఇచ్చి బావిలో పడేసిన నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 26న హత్యలు చేసిన నిందితున్ని పోలీసులు కోర్టుకు తీసుకురాగా... 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వరంగల్ సెంట్రల్ జైలుకు సంజయ్‌ను తరలించారు.
పోలీసు కస్టడీకి గొర్రెకుంట హత్యల నిందితుడు
విచక్షణా రహితంగా 9 మందిని హత్య చేసి బావిలో పడేసిన నిందితున్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించగా.. లోతైన సమాచారం కోసం గీసుకొండ పోలీస్‌స్టేషన్‌కు సంజయ్‌కుమార్‌ను తరలించారు. 6 రోజుల పాటు నిందితున్ని పోలీసులు విచారించనున్నారు.
మరింత లోతైన సమాచారం కోసం ఈరోజు వరంగల్ కేంద్ర కారాగారం నుంచి భారీ బందోబస్తు మధ్య గీసుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యంత భద్రత నడుమ నిందుతున్ని విచారించనున్నారు. సమగ్ర విషయాలను తెలుసుకునేందుకు డీసీపీ స్థాయి అధికారి విచారించనున్నట్లు తెలిసింది. హత్యలు చేసేందుకు గల కారణాలు, ఇతర అంశాలను నిందితుని నుంచి తెలుసుకునేందుకు సుమారు 6 రోజుల పాటు విచారణ చేయనున్నారు.
హత్యలకు ముందు నిందితుడు ఎక్కెడక్కడ తిరిగాడు? హత్యలకు ఎవరిదైనా సహకారం తీసుకున్నాడా.? హత్యలు ఎలా చేశాడు..? ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారించే అవకాశం ఉంది.