ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెరాస ఆవిర్భావ దినోత్సావాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నాయకులచే జెండా ఎగుర వేయించి మిఠాయిలు తినిపించుకుంటున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో జెండాను జేఏసీ ఛైర్మన్ కుందురు రమేష్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఆకుల సురేందర్ రావు, నాయకులు సుధీర్ రెడ్డి, వనజ రాణి, రంగు కుమార్, తదితరులు వేడుకలకు విచ్చేశారు.