తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2019, 6:19 AM IST

ETV Bharat / state

వరంగల్​లో బీభత్సం సృష్టించిన గాలివాన

శనివారం రాత్రి వరంగల్​లో గాలి వాన బీభత్సం సృష్టించింది. నగరంలో గాలి విపరీతంగా వీయటం వల్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్​ తీగలు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్​ నిలిచిపోవటంతో  ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పగటి ఎండలకు వాతావరణం వేడెక్కగా.... రాత్రి కురిసిన వర్షానికి వాతావరణం కొంత చల్లబడింది. మరోపక్క ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు మండలాల్లో మామిడి పంట దెబ్బతింది.

బీభత్సం సృష్టించిన గాలివాన

బీభత్సం సృష్టించిన గాలివాన

వరంగల్​లో ఈదురుగాలులతో కూడిన వర్షం అలజడిని సృష్టించింది. రాత్రి సమయంలో ఉరుములు, గాలితో కూడిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట పల్లపు ప్రాంతాలలోని రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరం మొత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఉరుములతో కూడిన భారీ వర్షం

వరంగల్ రైల్వే స్టేషన్​లో ఫ్లాట్​ఫాంపై రేకులు పట్టాలపై ఎగిరి పడడంతో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మసాగర్, వేలేరు మండలాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడితోటలలో మామిడికాయలు రాలిపోయాయి. జనగామ జిల్లా నర్మెట్ట, లింగాల ఘణపురంలో వడగళ్ల వర్షం పడింది. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

వాతావరణం చల్లగా మారటంతో ఉపశమనం

ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు..ఒక్క సారిగా వర్షం కురవటంతో వాతావరణం చల్లగా మారింది. భానుడి భగభగల నుంచి కొంతైనా ఉపశమనం లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​లో వర్ష బీభత్సం... ట్రాఫిక్​కు అంతరాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details