వరంగల్ గ్రామీణ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ప్రధానంగా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో ఎడతెరుపులేకుండా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచు దుప్పటి కప్పుకున్న ఓరుగల్లు - వరంగల్ నగరంలో మంచు అందాలు
వరంగల్ నగరంలో మంచు అందాలు కనువిందు చేశాయి. సూరీడు కూడా మబ్బుల దుప్పటి కప్పుకొని బయటకు రాకుండా దోబూచులాడాడు.
మంచు దుప్పటి కప్పుకున్న ఓరుగల్లు
ఉదయం నడకకు వెళ్లేవారు కూడా మంచు కారణంగా ఇంట్లోంచి బయటకు రాలేదు. మంచు కారణంగా ఏర్పడ్డ అందమైన దృశ్యాలు నగరవాసులకు కనువిందు చేశాయి. స్వీయ చిత్రాలు తీసుకుని పొగ మంచు అందాలను ఆస్వాదించారు.
- ఇదీ చూడండి :ఆ వీడియోను పూర్తిగా చూడండి: మంత్రి కేటీఆర్