తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణలో భాజపా జెండా ఎగురవేయాలి' - తెలంగాణ వార్తలు

వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేటలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఎం కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని నేతలకు సూచించారు.

Former Pm Vajpayee Jayanti celebrations and pm kisan programme were attended by ex MP Garikapati Mohan Rao
'తెలంగాణలో భాజపా జెండా ఎగరవేయాలి'

By

Published : Dec 25, 2020, 6:55 PM IST

తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేటలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పీఎం కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ప్రసంగం అనంతరం పార్టీ నేతలతో గరికపాటి సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని నేతలకు సూచించారు. అనంతరం వర్ధన్నపేట మండల పరిధిలోని సుమారు వంద మంది యువతను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చూడండి: గంటన్నరలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details