అవతరణ దినోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు - formation day arrangements
రేపు జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామీణ జిల్లా వేడుకలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
అవతరణ దినోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు
వరంగల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జేఎన్ఎస్ మైదానంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరుకానున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకున్నారు. షామియానాలు, చలువ పందిళ్లు, బారికేడ్లు, వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు.