తెలంగాణ

telangana

ETV Bharat / state

విదేశీ సాధువు - machchendra nath

భారతీయ సంస్కృతి  ప్రపంచంలోకెల్లా గొప్పదని భావించే ఓ విదేశీయుడు ఇక్కడి ఆధ్యాత్మికతకు ముగ్ధుడైపోయాడు. వీలున్నప్పుడల్లా వచ్చి ఇక్కడి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాడు. శివతత్వానికి మించి, మహిమాన్వితమైనది మరొకటి లేదని చెబుతున్నాడు చెక్​ రిపబ్లిక్​ దేశానికి చెందిన మచ్చేంద్రనాథ్.​

విదేశీ సాధువు

By

Published : Feb 10, 2019, 5:11 AM IST

ఓరుగల్లులో విదేశీ సాధువు
వేదాలు వెలసిన ధరణి భారతదేశం. ఓంకార నాదం పలికిన అవని ఈ దేశం. ప్రపంచ దేశాలు కన్ను తెరవకముందే ఈ నేలలో విజ్ఞాన కిరణాలు ప్రసరించాయి. అందుకే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచ దేశాలు జేజేలు కొడుతాయి. భారతావనికి వచ్చి ఇక్కడి ఆధ్యాత్మికతకు పరవశం చెందిన విదేశీయులెందరో. అందులో ఐరోపాకు చెందిన మచ్చేంద్రనాథ్​ ఒకరు.

భారతదేశమన్నా, ఇక్కడి సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే మచ్చేంద్ర ఈ సారి ఉత్తరప్రదేశ్​లోని కుంభమేళాకు వచ్చారు. అక్కడి నుంచి దక్షిణభారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓరుగల్లులోని వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు.

కంప్యూటర్లు లేని కాలంలోనే గొప్ప గొప్ప కట్టడాలను నిర్మించిన ఘనత భారతదేశానిదని కీర్తించారు. మహాశివరాత్రి దాకా ఇక్కడే ఉండి శ్రీశైల మల్లిఖార్జున్ని దర్శిస్తానని తెలిపారు. భారతదేశానికి ఎన్నిసార్లు వచ్చినా తనివితీరదన్నారు.

ABOUT THE AUTHOR

...view details