తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహమ్మారికి మందే లేదు... నివారణ ఒక్కటే మార్గం'

కరోనాపై అవగాహన కల్పించేందుకు కవులు, కళాకారులు ముందుకు వస్తున్నారు. 'మహమ్మారికి మందే లేదు... నివారణ ఒక్కటే మార్గమని' వరంగల్​ రూరల్​ జిల్లాకు చెందిన గాయకుడు శ్రీనివాస్​ గొంతెత్తారు.

By

Published : Mar 29, 2020, 8:08 PM IST

Warangal Srinivas
Warangal Srinivas

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ప్రజా గాయకుడు వరంగల్ శ్రీనివాస్ కోరారు. తన సొంతూరైన తక్కళ్లపాడులో స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన యువతను చైతన్యపరచడమే ధ్యేయంగా కలాన్ని ఝళిపించారు పాట రాసి... తన గళంతో వినిపించారు.

తెలంగాణ ఉద్యమంలో గాయకునిగా తన వంతు పాత్ర పోషించిన వరంగల్ శ్రీనివాస్... ముఖ్యమంత్రి ఆదేశాలతో ఓ పాటను స్వరపరిచారు. తన బాధ్యతగా పాట రాసి ఏ వాయిద్యాలు ఉపయోగించకుండా పాడారు. తన పాట ద్వారా ఒక్కరు మారినా తన కృషి ఫలించినట్లేనని ఈటీవీ భారత్​కు తెలిపారు.

'మహమ్మారి మందే లేదు... నివారణ ఒక్కటే మార్గం'

ఇవీ చూడండి:'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'

ABOUT THE AUTHOR

...view details