వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అరుదైన సంఘటన జరిగింది. ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఏకంగా ఐదు కిలోల బరువు ఉండడంతో బాల భీముడు జన్మించాడంటూ బంధువులు, ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
five kgs child: అరుదైన సంఘటన.. ఐదు కిలోల శిశువుకు జన్మనిచ్చిన మహిళ
పిల్లలు పుట్టినప్పుడు సాధారణంగా రెండు నుంచి మూడు కేజీలకు పైగా ఉండటం సహజం. మరీ ఎక్కువ అంటే నాలుగు కేజీలు ఉండొచ్చు. కానీ వరంగల్ జిల్లాలో మాత్రం ఓ మహిళకు బాల భీముడు జన్మించాడు. శిశువు ఏకంగా ఐదు కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అరుదైన సంఘటనతో ఆస్పత్రి సిబ్బంది, బంధువులు ఆనందంలో మునిగిపోయారు.
జిల్లాలోని తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామానికి చెందిన గద్దల స్పందన అనే మహిళ ప్రసవం కోసం వర్ధన్నపేట ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఐదు కేజీల బరువైన మగ పిల్లాడికి జన్మనిచ్చింది. దాదాపు వెయ్యి మందిలో ఒకరు ఇలా అధిక బరువుతో జన్మిస్తారని వైద్యులు వెల్లడించారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అరుదైన చికిత్స చేసి తల్లీ, బిడ్డలను కాపాడిన వైద్యులకు గర్భిణీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:corona vaccine: వేళకు రెండో డోసు తీసుకుంటేనే యాంటీబాడీలు: డీహెచ్