విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌కు చేరుకునేసరికి దాదాపుగా 10 బోగిలలో మంటలు అంటుకున్నాయి. మూడు బోగిలలో పూర్తిగా బొగ్గు అంటుకొని మంటలు ఎగిసిపడటం వల్ల అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, డోర్నకల్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు - గూడ్స్ రైలు
వరంగల్ గ్రామీణ జిల్లాలోని నెక్కొండ దగ్గర గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించటం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి. విశాఖ నుంచి మహారాష్ట్రకు బొగ్గు లోడ్‌తో గూడ్స్ రైలు వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది.
గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు