వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటి మందు ఫీల్డ్ అసిస్టెంట్లు బైఠాయించారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాత్కాలిక సస్పెన్షన్ను ఎత్తివేసి.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముందు బైఠాయించిన ఫీల్డ్ అసిస్టెంట్లు - field assistants protest at minister errabelli house
తమ కుటుంబాలను మంత్రే ఆదుకోవాలంటూ.. తమపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాత్కాలిక సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటి మందు ఫీల్డ్ అసిస్టెంట్లు బైఠాయించారు.
![మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముందు బైఠాయించిన ఫీల్డ్ అసిస్టెంట్లు field assistant dharna to lift up their suspension](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8693103-31-8693103-1599316957562.jpg)
మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముందు బైఠాయించిన ఫీల్డ్ అసిస్టెంట్లు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్లు)గా గ్రామీణ స్థాయిలో ఎనలేని సేవలను అందించినా.. తెలంగాణ సర్కారు తమపై దయ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి... తమ గోడును ప్రభుత్వానికి వివరించాలన్నారు. త్వరితగతిన ఫీల్డ్ అసిస్టెంట్లకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ఈనెల 12నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు