తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. రైతుల రాస్తారోకో - Farmers' concern is the latest news

వరంగల్ గ్రామీణ జిల్లా వేపచెట్టు తండాలో రైతులు రోడ్డెక్కారు. తమ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. రాస్తారోకో నిర్వహించారు.

Farmers' concern at vepachettu thanda in Warangal Rural District
పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. రైతుల రాస్తారోకో

By

Published : Nov 23, 2020, 10:14 PM IST

తమ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టు తండాలో చోటు చేసుకుంది.

గ్రామంలోని చాలా మంది రైతులకు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని రైతులు 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే ఆర్టీవో వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి రైతులను శాంతింపచేసి రాస్తారోకో విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details