వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుగ్గొండి మండలం తిమ్మంపేట వీఆర్వోపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు దాడి చేశారు.
వీఆర్వోపై ముగ్గురు రైతుల దాడి - వీఆర్వోపై రైతుల దాడి
తమ భూమిని వేరే వారి పేరు మీద పట్టా చేశారనే ఆరోపణతో వరంగల్ గ్రామీణ జిల్లా తిమ్మంపేట వీఆర్వోపై ముగ్గురు రైతులు దాడికి పాల్పడ్డారు.
కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వీఆర్వోపై దాడి
తిమ్మంపేటకు చెందిన గందె ఉప్పలయ్య, గందె సదానందం, గందె సుధీర్లు తమ భూమిని అదే గ్రామానికి చెందిన గందె అరుణ పైరు మీద పట్టా చేశారని ఆరోపిస్తూ వీఆర్వో కొమురయ్యపై దాడికి పాల్పడ్డారు.
తాను బదిలీపై ఇటీవలే వచ్చానని, భూమి విషయం తనకు తెలియదని ఎంత చెప్పినా వారు వినలేదని వీఆర్వో వాపోయారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోనికి తీసుకెళ్లి దాడి చేశారని తెలిపారు. వారిపై నర్సంపేట పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి : అద్దె ఇంటి కోసం వెతుకుతూ మృత్యు ఒడిలోకి