తెలంగాణ

telangana

కొనుగోళ్లు జరపడం లేదంటూ రైతుల ఆందోళన

మూడు వారాలైనా తమ ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని వరంగల్ గ్రామీణ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందున్న వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు.

By

Published : May 25, 2021, 2:19 PM IST

Published : May 25, 2021, 2:19 PM IST

farmers
farmers


వరంగల్ గ్రామీణ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎన్నిసార్లు రోడ్డెక్కినా వారి సమస్య తీరడం లేదు. ఈరోజు వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రం ముందు మూడు వారాలైనా తమ ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని రైతులు వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు.

అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెడుతూ ధాన్యం కొనుగోళ్లు సరిగా జరపడం లేదని వాపోయారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిపోయాయి. పోలీసులు చేరుకుని రైతులను శాంతింపజేసి ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు.

ABOUT THE AUTHOR

...view details