వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి భూమిని ఆక్రమించారంటూ.. అతని కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు. రాయపర్తి మండలం ఉకల్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు లింగబత్తుల వెంకట్‌కు 1963లో అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమికి కేటాయించింది. ఆ స్థలంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, విలేజ్ పార్క్ నిర్మించేందుకు యత్నిస్తున్నారని భాదితులు తెలిపారు.
మాజీ సైనికుడి భూమి ఆక్రమణ!.. బాధితుల ఆందోళన
మాజీ సైనికుడి భూమి ఆక్రమించారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ సైనికుడి భూమి ఆక్రమణ!.. బాధితుల ఆందోళన
నిర్మాణాలు ఆపాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రాయపర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. భూమికి సంబంధించిన పూర్తి పత్రాలు తనవద్ద ఉన్నాయని.. కలెక్టర్ స్పందించి.. విచారణ చేపట్టారని కోరారు.