వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో వ్యాపార సముదాయాలకు సరి, బేసి విధానం అమలవుతుందని మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. 45 రోజుల నుంచి మూత పడిన దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తెరవాలని నిర్ణయిస్తూ నెంబర్లు కేటయించారు.
వర్ధన్నపేటలో సరి, బేసి విధానం అమలు.. - corona update
లాక్డౌన్ కారణంగా మూతపడిన దుకాణాలు ఎట్టకేలకు తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కారణంగా... వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో అధికారులు సరి, బేసి విధానం అమలు చేశారు.
వర్ధన్నపేటలో సరి, బేసి విధానం అమలు..
దుకాణాల దగ్గర రద్దీ లేకుండా చేసేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. దుకాణాలను ఏ, బీ, సీ విభాగాలుగా విభజించారు. సరి, బేసి విధానంలో తెరవాలని సూచించారు. నిబంధనలు ఎవ్వరు అతిక్రమించినా... మాస్కులు, సామాజిక దూరం పాటించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.