వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
1. వలస కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని తీసుకొచ్చే ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?
ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తున్న వందలాది మందిని పరీక్షించాక హోం క్వారంటైన్‌కు పంపుతున్నాం. మన దగ్గరున్న వారు శ్రామిక్ రైళ్ల ద్వారా వెళ్తున్నారు.
2. చాలా మంది రూ. 1500 నగదు జమ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు?
బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల పోస్టాఫీసు ద్వారా అందజేస్తున్నాం. గత నెల 12వేల మంది ఫిర్యాదు చేస్తే 9వేల మందికి పైగా ఇచ్చాం. మిగతా వారికీ ఇస్తున్నాం.
3. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూడాల్సి వస్తోంది. దీని నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
కరీంనగర్‌లో 13 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మిల్లులను ట్యాగ్‌ఆన్ చేయడంతో ధాన్యం కొనుగోళ్లలో సమస్య తీరింది. మన వద్ద రా రైస్ మిల్లులనూ వాడుకుంటున్నాం.
4. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేందుకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు?
ప్రైవేటు ఆసుపత్రుల్లో వచ్చిన వారికి ప్రాథమిక థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి సేవలు అందించే అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతించాం.
5. జోన్ల వారీగా జిల్లాల్లో అనేక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవి సక్రమంగా కొనసాగుతున్నాయా?
వైరస్ వ్యాప్తి కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఆరెంజ్ జోన్ అని లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చాక నిబంధనలు సడలిస్తాం.
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ , అజీమ్
1. వలస కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని తీసుకొచ్చే ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?
వలస కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని తీసుకు వచ్చే ప్రక్రియ అమలుకు అదనపు కలెక్టర్, డీఎల్‌పీఓను ప్రత్యేక అధికారులను నియమించాం.
2. చాలా మంది రూ. 1500 నగదు జమ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు?
రియల్ చెక్ నిర్వహిస్తున్నాం. ఖాతాల్లో నగదు జమ కాని వారి సమస్యను పరిష్కరించేందుకు డీఆర్డీవో, ఇతర అధికారులను నియమించాం.
3. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూడాల్సి వస్తోంది. దీని నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా సీనియర్ అధికారులతో స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశాం.
4. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేందుకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు?
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఐఎంఏ, రెడ్‌క్రాస్ సమన్వయంతో టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలకు సూచనలు ఇప్పిస్తున్నాం.
5. జోన్ల వారీగా జిల్లాల్లో అనేక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవి సక్రమంగా కొనసాగుతున్నాయా?
జిల్లా సరిహద్దుల్లో 9 తనిఖీ కేంద్రాలున్నాయి. వైద్య ధ్రువపత్రాలు ఉన్న వారికే అనుమతి ఇస్తున్నాం. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తున్నాం.
- మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్
1. వలస కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని తీసుకొచ్చే ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?
ఇప్పటి వరకు సుమారు 6వేల మంది కూలీలను వారి స్వస్థలాలకు పంపించాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 2వేల మందిని హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నాం.
2. చాలా మంది రూ. 1500 నగదు జమ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు?
సుమారు 14 వేల మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పరిష్కారానికి చర్యలు చేపట్టాం.
3. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూడాల్సి వస్తోంది. దీని నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు పంపిస్తున్నాం. 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి కాగా, వీటి తరలింపులో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 25 రోజుల్లో ఈ సమస్య సమసిపోతుంది.
4. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేందుకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు?
వైద్య శాఖ సిబ్బంది, పర్యవేక్షకులతో ఆయా ఆసుపత్రుల నిర్వహణపై దృష్టి పెట్టాం.
5. జోన్ల వారీగా జిల్లాల్లో అనేక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవి సక్రమంగా కొనసాగుతున్నాయా?
గ్రీన్‌జోన్‌లో ఉన్నప్పటికీ వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, ఇతరులు వస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటున్నాం.