కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భాజపా నాయకులకు మాట్లాడే అర్హత లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో మంత్రి పర్యటించారు. పర్వతగిరి, అన్నారం చెరువులను మినీట్యాంక్‌బండ్‌గా మార్చే పనులను ఎమ్మెల్యే రమేశ్‌తో కలిసి పరిశీలించారు.
ప్రతిపక్షాలవి చౌకబారు విమర్శలు: మంత్రి ఎర్రబెల్లి - ERRABELLI FIRE ON OPPOSITIONS AT WARANGAL RURAL DISTRICT
వరంగల్ గ్రామీణ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. పర్వతగిరి, అన్నారం చెరువులను మినీట్యాంక్‌బండ్‌గా మార్చే పనులను ఎమ్మెల్యే రమేశ్‌తో కలిసి పరిశీలించారు. ప్రతి పక్షాలు చౌకదారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
ERRABELLI FIRE ON OPPOSITIONS AT WARANGAL RURAL DISTRICT
అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం ఆశీర్వాదంతో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్, భాజపా ఎం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షాలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తెరాస పనిచేస్తోందని వివరించారు.