ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. దీంతో కాలుష్య నియంత్రణకు తనవంతు ప్రయత్నంగా ముప్పారపు రాజు చొప్పబెండు పెన్నుల తయారీకి పూనుకొన్నారు. ఈయనది వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం. మొక్కజొన్న చొప్పలను సేకరించి వాటిలో రీఫిల్‌లను అమర్చుతూ ఈ పెన్నులకు రూపమిస్తున్నారు. వరంగల్ నగరపాలిక కమిషనర్ పమేలా సత్పతి.. ఈ పెన్నులు బాగున్నాయంటూ ట్విటర్ వేదికగా కితాబిచ్చారు. ప్లాస్టిక్ పెన్నులకు బదులు వీటిని వినియోగిస్తే పర్యావరణానికి కొంతైనా మేలుచేసిన వారమవుతామంటారు రాజు.
ఎకో ఫ్రెండ్లీ పెన్ను.. పర్యావరణానికి దన్ను - ప్లాస్టిక్ రహిత పెన్నులు
పర్యావరణ సమస్యలకు చెక్ పెట్టడంలో భాగంగా.. వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఓ యువకుడు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. మొక్కజొన్న పొట్టు నుంచి పెన్నులు తయారు చేసి.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చూడ ముచ్చటగా ఉన్న.. ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నుల వాడకం వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని అంటున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్.
eco friendly pens