వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కరోనా లాక్డౌన్ పరిస్థితులపై పాత్రికేయుడు రాజేందర్ రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
పరకాలలో ఘనంగా డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు - ambedkar jayanti news
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పరకాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
రాజ్యాంగం ఆధారంగా భారతదేశ పాలన.. అంబేడ్కర్ మనకిచ్చిన గొప్ప వరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 25కి.మీలు పరుగు చేస్తోన్న స్థానిక హోంగార్డు కుమార్ను ఆయన సత్కరించారు.
ఇదీ చదవండి:అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వ్యక్తి అంబేడ్కర్: హరీశ్ రావు