వరంగల్ గ్రామీణ జిల్లా, గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఉన్న కాకతీయుల నాటి ఏకవీర ఆలయం శిథిలావస్థకు చేరింది. కాకతీయుల శిల్ప వైభవం కూలిపోయే దశకు చేరినా అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. ఆలయానికి గతంలోనే డబ్బులు మంజూరైనట్టు గ్రామస్థులు చెబుతున్నా, ఆ నిధులు ఎటెళ్లాయో తెలియడం లేదు. క్రీ.శ. 1208లో ఏకవీర ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఈ ఆలయం సమీపంలో సైన్యానికి యుద్ధ విద్యలు నేర్పే స్థావరం కూడా ఉండేది. ఇక్కడి నుంచి వరంగల్ కోట వరకు రహస్య సొరంగం ఉండేదని చరిత్ర కారులు చెబుతున్నారు. సుమారు 25 స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయం మాత్రం ఇప్పుడు పూర్తి శిథిలావస్థకు చేరింది.
పట్టించుకోని అధికారులు
ఆలయంలో గుప్త నిధులున్నాయని గతంలో కొందరు గర్భగుడి ముందున్న మండపాన్ని పగులగొట్టి తవ్వకాలు జరపడం వల్ల ఆలయం పునాది దెబ్బతిన్నది. ముందు భాగంలో స్తంభాలన్నీ ఒరిగిపోయాయి. ఈ విషయం రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల దృష్టికెళ్లినా... ఆలయాన్ని కాపాడతామంటూ నాలుగేళ్ల కిందట ఓ బోర్డు ఏర్పాటు చేసి.. స్తంభాలకు ఊతంగా ఇసుక బస్తాలు పెట్టి చేతులు దులుపుకున్నారు.
విడుదల కాని నిధులు...