తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థికంగా చితికిపోతున్న డయాలసిస్​ పేషెంట్లు - వరంగల్​ రూరల్​ జిల్లా వార్తలు

కిడ్నీలు పాడైన వారు వారానికి మూడుసార్లు డయాలసిస్​ చేయించుకోవాలి. ఇందుకోసం ఆస్పత్రికి వచ్చిపోయో ఖర్చలు వారికి భారమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కూడా పింఛన్లు అందించి ఆదుకోవాలని కిడ్నీ బాధితులు కోరుతున్నారు.

dialysis
డయాలసిస్​ పేషెట్లు

By

Published : Jul 16, 2021, 8:34 PM IST

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎనిమిది నుంచి 10 వేల మంది కిడ్నీ బాధితులు ప్రభుత్వ, పైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. పేద బాధితులు ప్రభుత్వ సహకారంతో డయాలసిస్ చేయించుకుంటూ రోజులు గడుపుతున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ సెంటర్లలో రోగుల సంఖ్యను బట్టి ఒక్కో సెంటర్​లో నాలుగు, ఐదు షిఫ్టులను నిర్వహిస్తున్నారు. ఒక రోగికి నాలుగు గంటలపాటు డయాలసిస్ చేస్తారు.

వారు అసౌకర్యానికి గురి కాకుండా స్లాట్​ పద్ధతి ఏర్పాటు చేశారు. బాధితులు స్లాట్​ బుక్​ చేసుకోని డయాలసిస్​ చేయించుకుంటున్నారు. డయాలసిస్ సెంటర్ వారు రోగులకు ఇచ్చిన సమయానికి బస్సులు లేకపోవటంతో ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. దూరాన్ని బట్టి వారానికి రెండు, మూడు వేల రూపాయలు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు.

నెలనెలా మందులు, ప్రయాణ ఖర్చులు కలిపి ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి డయాలసిస్ చేయించుకుంటూ... ఉన్న భూములు, ఆస్తులను అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏం పని చేయలేకపోతున్నామన్నారు. వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇచ్చినట్లు తమకు కూడా పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

'ఆరు సంవత్సరాల నుంచి డయాలసిస్​ చేయించుకుంటున్నాను. వారంలో మూడుసార్లు డయాలసిస్​ అవుతుంది. ఆటో కిరాయి రూ.500 అవుతోంది.'

-లక్ష్మి, డయాలసిస్ పేషెంట్, కొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా

'నాలుగ ఏళ్ల నుంచి డయాలసిస్​ చేయించుకుంటున్నాను. ప్రయాణ ఖర్చు ఎక్కువ అవుతోంది. కేసీఆర్​ పింఛన్​ ఇవ్వాలని కోరుతున్నాం.'

-విజయ, డయాలసిస్ పేషెంట్, గుండెంగ, వరంగల్ గ్రామీణ జిల్లా

ఆర్థికంగా చితికిపోతున్న డయాలసిస్​ పేషెట్లు

ఇదీ చదవండి:CM KCR: 'చేనేత వర్గాలకు వంద శాతం ఉజ్వల భవిష్యత్​ అందిస్తా'

ABOUT THE AUTHOR

...view details