వరంగల్ గ్రామీణ జిల్లాలో ధరణి ఆస్తుల నమోదు చురుకుగా సాగుతోందన్నారు వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత. సంగెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి నమోదుకు కార్యాలయాలకు వచ్చే వారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు.
ధరణి ఆస్తుల నమోదు చురుకుగా సాగుతోంది: కలెక్టర్ - ధరణి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ హరిత
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి నమోదు ప్రక్రియను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి ఆస్తుల నమోదు చురుకుగా సాగుతోందని తెలిపారు.
ధరణి ఆస్తుల నమోదు చురుకుగా సాగుతోంది: కలెక్టర్
నమోదు ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా... నేరుగా తమని సంప్రదించాలని అధికారులకు తెలిపారు. అనంతరం ధరణిలో నమోదు పూర్తి చేసుకున్న పత్రాలను అర్హులకు కలెక్టర్ అందించారు.
ఇదీ చదవండి:ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక.. 10న లెక్కింపు