వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో 20వ మండల పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మంగళవారం ఆలయంలో స్వామివారికి ఘనంగా పల్లివేట కార్యక్రమాన్ని జరిపారు. డప్పు వాయిద్యాలతో కళాకారుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. స్వామి వారిని ఆలయం నుంచి పల్లకిలో కిందకు తీసుకువచ్చి రథంపై పుర వీధుల్లో ఊరేగించారు.