తెలంగాణ

telangana

ETV Bharat / state

నెక్కొండలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ప్రైవేటు గోదాంల వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

derailed goods train in nekkonda
నెక్కొండలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

By

Published : May 19, 2021, 1:58 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ప్రైవేట్ గోదాంల( చల్లా గోదాంల) వద్ద ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెక్కొండ రైల్వే స్టేషన్ నుంచి ప్రైవేట్ గోదాంలలోకి గూడ్స్ బండి వెళ్తుండగా... ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 3 డబ్బాలు పట్టాలు తప్పాయి.

అదృష్టవశాత్తు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్లు యధావిధిగా నడుస్తున్నాయి. సంఘటనా స్థలానికి గోదాంల యాజమాన్యం ఎవరినీ అనుమతించలేదు. పూర్తి వివరాలను వెల్లడించలేదు.

ఇదీ చదవండి:18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details