తెలంగాణ

telangana

ETV Bharat / state

గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు

గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు
గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు

By

Published : Oct 28, 2020, 12:28 PM IST

Updated : Oct 28, 2020, 1:16 PM IST

12:26 October 28

గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు

     వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువైనట్లు వరంగల్ జిల్లా కోర్టు ప్రకటించింది. నిందితుడికి కాసేపట్లో మొదటి అదనపు జిల్లా కోర్టు  శిక్ష ఖరారు చేయనుంది. కేసుకు సంబంధించి 67 మంది సాక్ష్యులను విచారించినట్లు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తెలిపారు.  

     ఈ ఏడాది మే 20న వరంగల్  గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో పాడుపడిన బావిలో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమబంగా నుంచి వచ్చి.. వరంగల్​లో స్థిరపడిన మక్​సూద్ అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారు. మక్​సూద్ ఇంటి పక్కనే నివాసం ఉండే ఇద్దరు బిహారీ యువకులూ హత్యకు గురయ్యారు. కేసు మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితుడు సంజయ్​కుమార్ అరెస్ట్ చేశారు. 

     ఒక హత్యను కప్పి పుచ్చుకోవడానికి 9 హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలో ఉండగానే అందరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హత్యలు చేసినట్లు పోలీసులు నిరూపించారు. ఘటన జరిగిన నెల రోజుల్లోపే దర్యాప్తు పూర్తిచేసి పోలీసులు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు.  

ఇదీ చూడండి:గొర్రెకుంట మృత్యుబావి కేసుపై కాసేపట్లో తీర్పు

Last Updated : Oct 28, 2020, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details