వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పండుగ సందర్భంగా టపాసులు కొనేందుకు ప్రజలు తండోపతండాలుగా దుకాణాల ముందు బారులు తీరారు. కొంతమంది దుకాణాలకు అభిమాన నాయకుల పేర్లను పెట్టుకున్నారు. అందులో భాగంగానే కేంద్ర హోమంత్రి అమిత్ షా పేరు మీద ఏర్పాటు చేసిన దుకాణం పలువురిని ఆకట్టుకుంది. ప్రజలందరూ పండగను కన్నులపండువగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
'అమిత్ షా' టపాసుల దుకాణం - వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పండగ వాతావరణం
వరంగల్ రూరల్ జిల్లా పరకాల టపాసుల దుకాణాలతో... కళకళలాడిపోతోంది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తు కనువిందు చేస్తోంది.
!['అమిత్ షా' టపాసుల దుకాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4882685-284-4882685-1572161225438.jpg)
అమిత్ షా పేరుతో టపాసులు దుకాణం