కరోనా మహమ్మారి తండ్రిని మింగేసింది. తల్లి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తల్లి వద్ద తోడు కుమారుడు ఉండగా.. ఆమె వైద్య ఖర్చుల కోసం ఇద్దరు కుమార్తెలు బస్‌స్టేషన్‌లో సాయం కోసం చేతులు చాచిన హృదయ విదారక సంఘటన ఇది. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలోని మల్లారెడ్డిపల్లి కాలనీకి చెందిన చిట్టిమళ్ల రవికుమార్ గ్యాస్ వెల్డింగ్ చేసేవారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రవికుమార్‌కు కరోనా సోకగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందారు. అతని భార్య సైతం వైరస్ బారినపడగా.. స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
తల్లి వైద్యానికి తల్లడిల్లిన కుమార్తెలు.. వైరస్‌తో తండ్రి మృతి! - తెలంగాణ వార్తలు
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. కొన ఊపిరితో ఉన్న అయిన వారికి కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. వైరస్ సోకి ఓ తల్లి ఆస్పత్రిలో ఉండగా... ఆమె వైద్యం కోసం కుమార్తెలు ఆరాటపడుతున్నారు. మందుల ఖర్చులకు డబ్బులు లేక స్థానిక బస్‌స్టేషన్‌లో వారు పలువురిని వేడుకున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.
ఆమెకు తోడుగా కుమారుడు ఉన్నాడు. వైద్యం, మందులకు భారీగా ఖర్చవుతుండటంతో ఇద్దరు కుమార్తెలు శనివారం స్థానిక బస్‌స్టేషన్‌లో సాయం కోసం పలువురిని వేడుకున్నారు. మల్లారెడ్డిపల్లి కాలనీవాసులు కొందరు చలించి తలా కొంత డబ్బు పోగు చేశారు. ఆదివారం వరకు సుమారు రూ.లక్ష జమైంది. కౌన్సిలర్ పాలకుర్తి గోపి, కాలనీవాసులు లలితా నర్సింగ్ హోం వైద్యులు రాజేశ్వరప్రసాద్‌ను కలిసి రవికుమార్ కుటుంబం పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఉచితంగా వైద్యం, అవసరమైన మందులు అందించడానికి అంగీకరించారని కౌన్సిలర్ తెలిపారు.
ఇదీ చదవండి:పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి
TAGGED:
warangal rural district news