తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంఈవో అవినీతిని నిరసిస్తూ.. విద్యార్థి నాయకుల ఆవేదన - వరంగల్ రూరల్ జిల్లా

ఎంఈవో అవినీతిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎంఈవో ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.

ఎంఈఓ అవినీతిని నిరసిస్తూ..విద్యార్థి నాయకుల ఆవేదన

By

Published : Jul 18, 2019, 10:38 PM IST

అవినీతికి కేరాఫ్ అడ్రస్​గా వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎంఈవో రమాదేవి మారిపోయారని వామపక్ష, తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం పరకాల మండల ఎంఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇటీవలే ప్రభుత్వం కేటాయించిన ఎంఆర్ఎఫ్ ఫండ్ 80 వేల రూపాయలు ఒకేసారి డ్రా చేసి ఎటువంటి లెక్కాపత్రం లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని వారు తెలిపారు.

ఎంఈఓ అవినీతిని నిరసిస్తూ..విద్యార్థి నాయకుల ఆవేదన

పరకాల ప్రైవేట్ స్కూళ్లు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్​ల పేరుతో బట్టల విక్రయ కేంద్రాలుగా మారాయన్నారు. ఎన్నిసార్లు ఎంఈవోకు వినతి పత్రాలు అందజేసిన బూడిదలో పోసిన పన్నీరుగా తయారైందని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజుల భారం భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఈవో నిర్లక్ష్యం వల్ల కనీసం మరుగుదొడ్లు లేక ఆడపిల్లలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎంఈవోను సస్పెండ్ చేయాలని, విద్యార్థుల జీవితాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : పనివేళల్లో టిక్​టాక్​.. మున్సిపల్ ఉద్యోగుల టైంపాస్​

ABOUT THE AUTHOR

...view details