వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ దినోత్సవాన్ని అట్టహాసంగా చేశారు దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు. రాజ్యాంగం ఆధారంగానే భారతీయుల స్థితిగతులు నిర్వహించబడుతున్నాయని, ఇంత ప్రాశస్త్యం ఉన్న రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదివాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రజాస్వామ్యంతో సహా సామాజిక ప్రజాస్వామ్యాన్ని అంబేడ్కర్ కాంక్షించారని కార్యకర్తలు ఉద్ఘాటించారు. ప్రతి ఊరిలో, వాడలో రాజ్యాంగం గురించి చర్చ జరగాలన్నారు. అప్పుడే అణగారిన వర్గాల ప్రజలు బతుకులు బాగవుతాయని సూచించారు.
'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి' - 'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి'
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు.
'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి'