తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాలతో అన్నదాతకు అపార నష్టం - farmers problems

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షానికి నీట మునిగింది. గాలివాన.. పంట చేతికి అందుతుందనుకున్న అన్నదాతల ఆశను, నిరాశ చేసింది. జిల్లాలో అర్ధరాత్రి కురిసిన వర్షం.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.

crop was submerged
పంట నేలపాలు

By

Published : Apr 14, 2021, 7:37 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. చేతికందొచ్చిన పంటను నీట ముంచి, రైతుల కష్టాన్ని కన్నీళ్ల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. నేలపాలు కావడంతో అన్నదాతల బాధ వర్ణనాతీతంగా మారింది.

అకాల వర్షం కారణంగా జిల్లాలోని.. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటలు.. ఈదురు గాలుల ధాటికి పూర్తిగా నీట మునిగాయి. దమ్మన్నపేటలో మామిడి కాయలు నేల రాలాయి. కక్కిరాలపల్లిలో.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న పంట నీట మునిగి... రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

మరో వారమైతే అమ్మకానికి పెట్టేవాళ్లం. టార్పాలిన్ కవర్లు కప్పినా.. ఫలితం లేకుండా పోయింది. పండించిన పంట కళ్ళముందే పాడయిపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి. అధికారులు.. నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.

- రైతులు

ఇదీ చదవండి:తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details