తెలంగాణ

telangana

మామిడి నేలరాలింది.. వరిపంట నీటిపాలైంది.. వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది

Crop loss in Telangana due to rains: అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన.. కర్షకులకు కడగండ్లనే మిగిల్చింది. చేతికి అందివచ్చిన పంట వర్షార్పణమైందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న నీటి పాలైంది. వరి, మిరప, మామిడి పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలూ.. ఎందుకూ కొరగాకుండా పోయాయి. పలు చోట్ల పశువులూ చనిపోయాయి. మొత్తం లక్షకుపైగా ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

By

Published : Mar 20, 2023, 9:19 AM IST

Published : Mar 20, 2023, 9:19 AM IST

Farmers problems with rains
Farmers problems with rains

అకాల వర్షాలు, వడగళ్ల వానతో రైతన్నలకు అపార నష్టం.. ప్రభుత్వానికి కన్నీటి విజ్ఞప్తి

Crop loss in Telangana due to rains: ఈదురుగాలులుతో కూడిన కుండపోత వాన.. వడగండ్లు.. అన్నదాతలను మరోసారి కన్నీటిపాలు చేశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షం, వడగండ్లు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. పంట సర్వం నష్టపోయి.. అన్నదాతలు దిక్కుతోచని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. మరో పదిహేను ఇరవై రోజుల్లో కంకి ముదిరి పంట చేతికి వస్తుందనుకున్న దశలో మొక్కజొన్న ఎందుకూ పనికిరాకుండా పోయింది.

Crop loss due to rains in Telangana : వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానలు రైతులను బేజారెత్తించాయి. చేతికంది వచ్చిన పంటలు గంటల వ్యవధిలోనే వర్షార్పణమైయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, వరి, మిరప, కూరగాయల పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కరెంట్ తీగలు తెగిపడ్డాయి. కల్లాల్లో ఉన్న మిరప తడిసి ముద్దై ఎందుకూ కొరగాకుండా పోయింది. నర్సంపేట, ఖానాపురం, గీసుకొండ, దుగ్గొండి, తదితర మండలాల్లో మక్క, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Heavy rain causes crop loss in Telangana : అత్యధికంగా 48 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయంది. నేల వాలిపోయిన పంట అక్కరకు రాకుండా పోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. హనుమకొండ జిల్లాలోనూ ఈదురుగాలుల తాకిడికి.. 5 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. 3 వేల15 ఎకరాల్లో మక్కలు, 946 ఎకరాల్లో వరి, 134 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా అకాల వర్షం రైతులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దామెర,ఆత్మకూర్ మండలాల్లో మొక్కజొన్న, మిర్చితో పాటు వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు.

ఈదురు గాలులతో నెలకొరిగిన పంటలు: పంట విత్తనంతో పాటు, కలుపు తీయడం, ఎరువులు వేసి పెట్టుబడి పెట్టారు. పంట ఖాత, పూత దశలో ఉంది. కొద్ది రోజులైతే పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయనే సమయంలో అకాల వర్షం వడగళ్ల రూపంలో వచ్చి పంటను నేలపాలు చేసింది. పెట్టిన పెట్టుబడి పోయి పంటకు ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న పంట నేలకొరగగా, కల్లాల్లో ఎండబెట్టిన మిరప, పొగాకు, పసుపు పంటలు తడిసి ముద్దయ్యాయి.

మామిడి కాయలు రాలి రైతులకు కన్నీటిని మిగిల్చాయి. జిల్లా వ్యాప్తంగా 4800 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. జనగామ జిల్లాలో 3950 ఎకరాల విస్తీర్ణంలో అకాల వర్షాలకు పంట నష్టపోయింది. ములుగు జిల్లాలో భారీ వర్షం.. గోదావరి పరివాహక ప్రాంతంలోని దాదాపుగా 50 ఎకరాల్లోని మిరప రైతులకు తీవ్ర నష్టం కలగచేసింది. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో మిరప రైతులు.. వర్షం దెబ్బతో కుదేలయ్యారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షం పాలైంది.

భూపాలపల్లి జిల్లాలో: గాలిదుమారం, వడగండ్ల వానలతో గోవిందరావు పేట మండలంలో మామిడి కాయలు ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భూపాలపల్లి జిల్లాలో కుండపోత వర్షం వడగండ్ల వానలు రైతులను అతలాకుతలం చేశాయి. భూపాలపల్లి, ఘన్ పూర్, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటల్లింది.

Farmers problems with heavy rains: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మరి నర్సాయిపల్లిలో వడగండ్ల వాన దెబ్బలకు తాళలేక 27 గొర్రె పిల్లలు మృతి చెందాయి. 17 గొర్రెపిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. దుగ్గొండి మండలం చాపలబండలో వడగండ్ల దెబ్బకు తాళలేక పరిగెత్తుకెళ్లి వ్యవసాయ బావిలో పడి 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి లేఖ రాశారు. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 22న తిరుమలగిరి మండలంలో నిరాహార దీక్షకు కూర్చొంటానని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

అకాల వర్షం.. రైతన్నకు నష్టం.. ఆదుకోవాలంటూ ప్రభుత్వంపైనే భారం

అకాలవర్షబీభత్సం.. అన్నదాతలకు తీరని నష్టం.. ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి

వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేసీఆర్​కు రేవంత్​రెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details