తెలంగాణ

telangana

ETV Bharat / state

పాకాల ఆయకట్టు వరిపొలంలో మొసలి ప్రత్యక్షం - paddy field

వరంగల్‌ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలో ఓ రైతు పొలంలో మొసలి కనిపించింది. పక్కనే ఉన్న పాకాల సరస్సు నీటి ప్రవాహానికి వచ్చి ఉంటుందని రైతులు భావిస్తున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు.

వరి పొలంలో మొసలి

By

Published : May 2, 2019, 5:52 PM IST

వరంగల్‌ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పాకాల ఆయకట్టు సంగెం పంట కాలువ వరి పొలాల్లో రైతులకు మొసలి కనిపించింది. వర్షాకాలంలో పాకాల సరస్సు నీటి ప్రవాహ ఉద్ధృతికి బయటకు వచ్చి పంట పొలాలకు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంటలు కోత దశకు రావడంతో పొలాల్లో నీరు లేకపోవడంతో అవి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులకు పొలాల్లో మొసలి కనిపించింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు రైతులు తెలిపారు. అధికారులు అక్కడికి చేరుకొని మొసలిని స్వాధీనం చేసుకొని పాకాల సరస్సులో వదలనున్నారు.

పాకాల ఆయకట్టు వరిపొలంలో మొసలి ప్రత్యక్షం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details