వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి జయసారధిరెడ్డిని గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఎన్నికల ప్రచారం గడువు నేటితో ముగియనుండడంతో వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఆయన బైక్ ర్యాలీని నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీపీఎం నేత తమ్మినేని - నర్సంపేటలో సీపీఎం ఎమ్నెల్సీ ఎన్నికల ప్రచారం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గడువు నేటితో ముగియనుండడంతో పలు రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీపీఎం నేత తమ్మినేని
నర్సంపేటలోని పాకాల సెంటర్ నుంచి అమరవీరుల స్తూపం వరకు సీపీఎం చేపట్టిన బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు విజయసారధి రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి:నాసిరకం ఇసుకతో చెక్ డ్యాం నిర్మాణం: సీపీఎం