వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని కాకతీయ నగర్లో గుడిసెలను తగలబెట్టి.. గుడిసెవాసులపై దాడులు చేయడం అత్యంత పాశవిక చర్య అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. కాలిన గుడిసెలను సందర్శించి.. క్షతగాత్రులను పరామర్శించారు.
" మూడు రోజుల క్రితం సీపీఎం గుడిసెలపై పోలెబోయిన వెంకటయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 40మంది అనుచరులతో వచ్చి పెట్రోల్‌తో తగలబెట్టారు. గుడిసెవాసులపై కర్రలతో దాడి చేశారు. మహిళలనీ చూడకుండా అత్యంత దారుణంగా కొట్టారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. 601సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి"