వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన నరసయ్య అనారోగ్యంతో ఈ నెల 19న ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందాడు. అయితే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. శనివారం వరకూ జనరల్ వార్డులో చికిత్స పొందిన నరసయ్యలో కొవిడ్ లక్షణాలు కనిపించడం వల్ల అదే రోజు రాత్రి ఆసుపత్రిలోని కరోనా వార్డుకు తరలించారు. శనివారం రాత్రి నరసయ్య మృతి చెందాడు.
చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు - చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు
గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఈ నెల 23న మృతి చెందాడు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించినందున అతడికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు వచ్చే వరకు అతడి మృతదేహాన్ని భద్రపరచనున్నారు.
మృతి చెందిన వ్యక్తికి కొవిడ్ పరీక్షలు
గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీలో భద్రపరచడం వల్ల నరసయ్య మృతదేహాన్ని మార్చురీకి ఆనుకొని ఉన్న మరో గదిలో భద్రపరిచారు. కరోనా పరీక్షల రిపోర్టులు రాగానే విషయాన్ని వెల్లడిస్తామని ఆసుపత్రి కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'
Last Updated : May 24, 2020, 4:08 PM IST