వరంగల్ జిల్లా కోర్టును పరిశీలించిన జస్టిస్ రాఘవేంద్ర - tirumala devi
వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు ఆవరణలోని శిథిలావస్థలో ఉన్న పలు భవనాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్. చౌహన్ ఆదేశించారు.
హన్మకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టును రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్. చౌహన్ పరిశీలించారు. జిల్లా జడ్జి తిరుమల దేవి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్‌తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే భవనాలను మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. పెచ్చులూడిన భవనాలపై స్పందిస్తూ... ప్రమాదాలు జరగకముందైనా మేల్కోవాలని సూచించారు. త్వరలోనే నూతన జడ్జిల నియమకాలను చేపట్టి కోర్టులో జడ్జిల కొరత తీర్చనున్నట్లు జస్టిస్ రాఘవేంద్ర తెలిపారు.